*బ్యాంకు పీవో పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే*

 *బ్యాంకు పీవో పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే*


👇👇


బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS PO- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే..


కెనరా బ్యాంక్: 2500

యూకో బ్యాంక్: 550

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500

పంజాబ్ సింధ్ బ్యాంక్: 253

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

ముఖ్యమైన తేదీలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2, 2022

రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది తేదీ: ఆగస్టు 22, 2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్‌ 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష : అక్టోబ‌రు 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2022

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

ఇంట‌ర్వ్యూలు : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

 తుది నియామకాలు: ఏప్రిల్ 2023

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి, ఇతర వివరాల కోసం https://www.ibps.inLink for apply  వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

Comments