*ఒక స్త్రీ పదికిలోమీటర్లు ఒక గంట నడిస్తే, ఒక పురుషుడు* *అదే పదికిలోమీటర్లు నడవడానికి ఒకటిన్నర గంట తీసుకున్నాడు.*
👍 *ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది.*
*స్త్రీ చక్కగా ఉన్న దారిలోను,*
*పురుషుడు ఎత్తుపల్లాలు* *కొండలు గుట్టలుఉన్న దారి ద్వారా వచ్చాడు.*
*👍ఇప్పుడు ఎవరు వేగంగా అంటే పురుషుడని అనిపిస్తుంది.*
*ఆ స్త్రీ కి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని చెప్పి ఇప్పుడెవరు వేగంగా నడిచారు ?*
*👍అంటే స్త్రీ అనిపిస్తుంది.*
*అదే పురుషుడు 140 kg అని,*
*స్త్రీ 60kg అని చెబితే*
*👍పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది.*
👉 *ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయలు ఉండడం లేదు. అందుకే ఏమీ తెలియకుండా, ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు* .
*#ఇదే_జీవితం. మనం ఒకరి గురించి ఆలోచించకుండా త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. పూర్తిగా తెలిసాక అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాము. అందరిని మనతో పోల్చుకోవడమో, మనల్ని వాళ్ళతో పోల్చుకోవడమో చేస్తాము.*
*👉జీవితం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. వారికి దొరికే అవకాశాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన శక్తి ఉంటుంది. వారు ఎదుర్కోవలసిన సమస్యలు వేరువేరుగా ఉంటాయి. వాటి పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి .*
*జీవితం ఎప్పుడూ అనుభవిస్తే కానీ పూర్తి అవగాహనో లేక అర్థమో తెలియదు. మరొకరితో పోల్చుకుని ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకండి.*
*మీ జీవితానికి మీరే కథానాయకుడు మీరు మాత్రమే నాయకుడు.*
Comments
Post a Comment