అందమా గుణమా? ఏది ముఖ్యం. ఒక చిన్న కధ!

అందమా గుణమా? ఏది ముఖ్యం. ఒక చిన్న కధ! 
*‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు. అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.* 

 *తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు.* 

 *తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును* *తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి ఎండ మండిపోతోంది.* *ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.* 

 *పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.* *ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి.* *దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు  అన్నాడు మంత్రి మళ్ళీ, పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.* 

 *వెంటనే రాజు ఆలోచించాడు మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం,* *పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది,జ్ఞానోదయమయింది.* 

 *వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను.*
 *బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.* 

 *ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరోకాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.* 

 *విజయగర్వంతో భగవంతుని మనం మరచిన తను మాత్రం మనల్ని మరువడు పైన చెప్పిన మంత్రి గారి లా ఎప్పుడు మన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాడు.* 

 *ప్రాణంతో ఉన్నప్పుడు మట్టి మన కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది ప్రాణం పోయాక తన కడుపులో మనల్ని నింపుకుంటుంది.* 

 *మట్టి కుండలు అన్నం వండుకుని తినే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని* 
 *కలిగి ఉన్నం మనం, కానీ మనల్ని మనం* *తెలుసుకోలేని,రక్షించుకోలేని దీనావస్థలో ఉన్నాం. అందుకు కారణం* 
 *మన అమాయకత్వమే.* 

ఐశ్వర్య రాయ్ కావాలంటే అద్రుష్టం ఉండాలి. కానీ మదర్ థెరిస్సా కావాలంటే మనసుంటే చాలు.

Comments