🙏 కృతజ్ఞత🙏
🍀🌹🌻🦚💧🌟
➡ జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్.
అపుడు ఏం జరుగుతుంది?
నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు.
➡నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్.
తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా ఉంటావు.
➡ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు.
➡నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యంగా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా థాంక్స్ చెప్పావా?*
➡మూడు పూటలూ నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా?
➡మూడు నిముషాలపాటు చెట్లు స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.
చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్క రోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా?
➡ఎండకూ, వానకూ, అమ్మకూ, నాన్నకూ నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతిగురువుకు నువ్వు తినే తిండికి
ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా?
➡అంటే నీకు తీసుకోడమే తప్ప ఇవ్వడం రాదన్నమాట !
సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది.
➡నిజానికి పై వస్తువులేవీ నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.
➡నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన *ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు!
నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది.
*ఇదే అంతః శుద్ధి!
ఇదే పవిత్రత!
ఇదే దైవత్వం!
ఇలాగే స్వచ్ఛతను సాధించాలి.
➡ సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అత్యంత శక్తి కల్గివుంటుంది.
➡ ప్రతీ రోజూ నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి, జంతువు, ప్రకృతి..ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి.
ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
Comments
Post a Comment