📚💐మిత్రులందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు💐📚


📚💐మిత్రులందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు💐📚

📚ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం (వరల్డ్‌ బుక్‌ డే)📚

 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే

ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు. - మహాత్మగాంధీ ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు. - నెహ్రు మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు. - ఫెడ్రంట్ రసెల్ మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు. - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు -నెల్సన్ మండేలా 🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం, 📘 పుస్తకం అన్నారు . పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ వ్యక్తి - లెనిన్ 📚 ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు. -చార్లీ చాప్లిన్ ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు. - విన్స్టెన్ చర్చిల్ 📚 భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు. -మార్టిన్ లుతెర్కింగ్ 📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి. - భగత్ సింగ్ 📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు. - అబ్రహం లింకన్ 📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, అతడే నా మార్గదర్శి అన్నారు. -జూలియస్ సీసర్ 🌏 ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా, అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు. -టెస్కార్డ్స్ 📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు. -ఇంగర్సాల్ 🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు. -సిగ్మెంట్ ఫ్రాయిడ్ 📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు. ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము. పుస్తకాలు అంటే కేవలం స్కూల్, కాలేజీ చదువుల పుస్తకాలు మాత్రమే కాదు. 📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚

Comments