story - ఎడారి లో తప్పిపోయిన మనిషి.


ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. 

అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.

నడుస్తున్నాడు. 

నీరు ఎక్కడా కనబడటం లేదు.

తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. 

ఈ రాత్రి గడవదు.

రేపు ఉదయం చూడను 

అని అనుకుంటున్న దశలో

 ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. 

💧దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది.

 అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో!

💧చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. 

శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు.

 గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.

💧దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. 

దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. 
నీరు రావడం లేదు. 
శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. 

అయినా ప్రయోజనం లేదు.

 నిరాశ నిస్పృహ ఆవరించాయి. 

ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది.

 కళ్లు మూసుకుపోతున్నాయి. 

💧ఒక మూలన సీసా కనిపించింది. 

దానిలో నీరు ఉంది.

 మూత గట్టిగా బిగించి ఉంది.

 మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు.

💧దానికి ఒక కాగితం కట్టి ఉంది. 

దాని మీద ఇలా ఉంది. 

ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి. 

పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి. 

💧అతడికి సందేహం కలిగింది. 

ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా?

 ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా?

 ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? 

చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు.

 అందులో పోసేస్తే మరణం ఖాయం.

💧ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. 

💧ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు.

 బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు.

 ఆశ్చర్యం!!!!!

💧పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. 

నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. 

తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. 

గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. 

తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు. 
..................................మ్తె డియర్ ఫ్రెండ్స్. 

💧 _ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.
..........................................
 ఇవ్వడం వల్ల మనం

 పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. 

ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి.

 కృషి చెయ్యకుండా ఫలితంఆశించకూడదు_ 

చావు బతుకుల మధ్య
ఇక్కడ తర్కం

🚰 ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ?

🚰 రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే....
మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. తరువాతా...??

🚰 అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి. 

తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు. 

వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు.

✅ కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్.

✅ గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం!!! నమ్మడమే శ్రేయస్కరం. 

💧💧  నువ్వు ఇవ్వకుండా
దేనినీ పొందలేవు

👍.ఇచ్చి...... పుచ్చుకోవడం నేర్వండి.😃 నేర్పించండి. అప్పుడే సక్రమంగా ఎలా జీవించాలో అర్థమౌతుంది. లేకపోతే జీవితం అర్థంతరంగా అంధకారంలో మునిగిపోతుంది.]

Comments