story-❤ జీవిత పయనం ❤ . . . ఓ చిన్న కథ . . చదవండి నచ్చితే లైక్ చేయండి . . . ఒక వ్యక్తికి నలుగురు భార్యలు
❤ జీవిత పయనం ❤
. . . ఓ చిన్న కథ . . చదవండి నచ్చితే లైక్ చేయండి . . .
ఒక వ్యక్తికి నలుగురు భార్యలు . . . నాలుగోవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి . . ఆమేకోరిన కోరికలన్ని తిర్చేవాడు అపురూపంగా చుసుకునేవాడు . . మూడొవ భార్య అన్నా ఇష్టమే . కానీ తన గురించీ మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు . . తను వారితో వెళ్ళిపోతుండెమో అన్న భయంతో . . .
రెండొవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు . . ఆమే కూడా అతని సమస్యను తీర్చి పంపేది . . .
మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు . . ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు . . ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి . . .
అతని ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడనీకీ తన నాలుగోవ భార్యనీ పిలిచాడు . .
నేను మరణానికి అతి దగ్గర్లో ఉన్నాను . . నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కాదా ! నాతోపాటు నువ్వు కూడా వచ్చేసేయ్ . . మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు . . .
నాలుగోవ భార్య అది వినీ అతనికి దూరంగా జరిగిపోయింది . . ఆశ్చర్యచకిడై తన మూడొవ భార్యను ఇదే కోరాడు . . . .
మూడొవ భార్య ఇలా అంది . .
ఇన్నిరోజులు నీతోనే , , , , నీ దగ్గరే ఉన్నాను . . నీ అవసరాలన్నీ తీర్చిను ఇక నాకు నీతో పనిలేదు వేరేవారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను అంది
బాధతో ఏడుస్తూ తన రెండొవ భార్యను ఇలాగే అడిగాడు .
అప్పుడు నేను నీతో పాటు నీ శేవయత్రలో పాల్గొనేంతవరకు నీ వెంటే ఉంటాను తరవాత నేను వెళ్ళిపోతాను . . నిన్ను అప్పుడప్పుడూ తలుచుకోగలను " అంది
ఇంత ప్రేమగా చూసుకున్నా ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృధా అని భావిస్తుండగా . .
మొదటి భార్య తలుపు చాటునుండి ఇలా అంది
మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట చివరి పయనం దాకా తప్పక వస్తాను . . . మీరేమీ బాధపడకండి ! అంది . .
అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది . .
కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు . . మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు . . . పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం లేదు . . .
నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాం . . . . అదేంటి అలా అంటున్నరు అని ఆశ్చర్యంగా ఉందా ? ? ? ? ? ? ? ? ? ? ?
నాలుగోవ భార్య . . . . . . . . . . . మన శరీరం
మూడొవ భార్య . . . . . . . . . . సంపద , ఆస్థిపాస్తులు
రెండొవ భార్య . . . . . . . . నేస్తాలు . . బందువులు
మొదటి భార్య . . . . . . . . మన ఆత్మ
నిజమే కాదా ! దయచేసి మన ఆత్మ చెప్పినదాన్ని ఆచరించండి పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి . . . . .
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
Comments
Post a Comment