*మనసు మాటల ముత్యాలు*

*మనసు మాటల ముత్యాలు*

🌹 *సంతోషం అనేది పది వేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు...*
*మన అనుకునే వారితో పది నిముషాలైనా*
*మనసువిప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది...!!*
 
🌹 *సహాయము అనేది అత్యవసరంలో*
*మాత్రమే స్వీకరించాలి.*
*లేదంటే అది*
*నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది..!*

🌹 *ఎవరికో నచ్చాలని నీవు అన్నీ మార్చుకొని*
 *నీలో నిన్ను కోల్పోకు...*
*ఎందుకంటే*
*నీకు నచ్చినట్లు నీకోసం మార్చుకునేవాళ్ళు ఒక్కరూ లేరు....!*

🌹 *ధైర్యం అన్నదే అసలైన సంపద*
*ధైర్యం కోల్పోయినట్లయితే*
        *అన్ని కోల్పోతాం..*

🌹 *అనేక విత్తనాలు నాటడం వల్ల భూమి ఏవిధంగా సారవంతమౌతుందో*
*అదేవిధంగా అనేక రకాల విషయాలను పరిశీలించడం ద్వారా మనస్సు వికసిస్తుంది....!*

🌹 *నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్థాయి ...*
*ముందు కాలికి గర్వం లేదు*
 *వెనకున్న కాలికి అవమానం లేదు* 
*ఎందుకంటే*
*ఒక్కక్షణం లో వాటి స్థానం మారుతుంది.*

Comments