*ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడున్న రంపంపై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది..*
వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది..
ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది..
పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని,
చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది..
మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది..
జీవితంలో ప్రశాంతంగా వుండలంటే అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండటమే..
కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది...
Comments
Post a Comment